అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: సునీల్ శర్మ

by Dishanational1 |
అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: సునీల్ శర్మ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలంగాణ హౌజింగ్ బోర్డు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నాంపల్లిలోని హౌజింగ్ బోర్డు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకునేలా చేశారన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ సమానులేనని చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ కె శ్రీనివాస్, కార్యదర్శి కె. మురళీధర్ రెడ్డి, ఎల్ఏఓ కె. వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఆఫీసర్ ఎస్. విమల, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాస్, ఈఈలు రాధాకృష్ణ, కిరణ్ బాబు, కె. అంకమరావు, దశరథ, ఆర్. శోభ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed