రైతుబంధు ఆపాలని నేను ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 16 |
రైతుబంధు ఆపాలని నేను ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బంధు ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..రైతు బంధును తాను ఆపాలని చెప్పినట్లు బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. గత నెలలో రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని మాత్రమే డిమాండ్ చేశామని, ఎక్కడా ఆపాలని చెప్పలేదన్నారు. రైతు బంధు పెంచాలని కోరుతున్నామన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని తమ మేనిఫెస్టోలో పెట్టామని, గతంలో ఒకే సారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ దేశంలోనే మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చామన్నారు. ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. మోడీ ,కేసీఆర్ లు రైతులకు అన్యాయం చేశారన్నారు. రైతుల ఆదాయం మోడీ డబుల్ చేస్తానని మాట తప్పారన్నారు. రైతులకూ నష్టం జరిగితే పంట భీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. లక్ష కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వక ముందే ప్రాజెక్టులు కూలిపోతున్నాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి వల్లే నాణ్యత లోపం ఉన్నదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని ఉత్తమ్ కుమార్ సవాల్ విసిరారు.



Next Story

Most Viewed