2030 నాటికి ప్రపంచంలో యువ దేశంగా ఇండియా: గవర్నర్

by Web Desk |
2030 నాటికి ప్రపంచంలో యువ దేశంగా ఇండియా: గవర్నర్
X

దిశ, ముషీరాబాద్: దేశానికి భవిష్యత్తే యువత అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జీసీఎస్ వారి సౌజన్యంతో వల్లూరి ఫౌండేషన్ వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వీఆర్. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులకు, కవులకు, సాహితీవేత్తలకు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా సమాజంలో యువత పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశానికి సంపద యువత, దేశానికి భవిష్యత్తే యువత అన్నారు. 2030 నాటికి ప్రపంచంలో భారతదేశం యువ దేశం కాబోతుందన్నారు. దేశంలో యువత పెరుగుతున్నారన్నారు. 131 కోట్ల మంది ఏకంగా ఉంటే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానమే చరిత్ర నిర్మాణానికి అత్యంత ప్రథమ ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story