హస్తకళాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొల్లం సంపత్

by Dishanational1 |
హస్తకళాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొల్లం సంపత్
X

దిశ, ముషీరాబాద్: హస్తకళాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని ప్రోత్సహించేందుకు గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పేరిట ప్రదర్శనలు నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్, హేండ్లూమ్స్ సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, జాతీయ బ్యాంక్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ వరకు కొనసాగనున్న గోల్కోండ హ్యాండి క్రాఫ్ట్, హేండ్లూమ్ ఎగ్జిబిషన్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, తెలంగాణ రాష్ట్ర హస్తళల అభివృద్ధి సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్, చింతల సుశీల, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్. జూట్ ప్రతినిధి నర్సింహులుతో కలిసి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తలు దేశ నలుమూలల నుంచి 150 మంది హస్తకళాకారులు ఏర్పాటు చేసిన వస్తువులను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కళాకారుల సంక్షేమానికి ఎప్పుడు అండగా ఉంటుందని, అందులో భాగంగానే నైపుణ్యమైన హస్తకళలను తయారు చేసిన కళాకారులకు ఈ ఎగ్జిబిషన్లో శాలువాలు, నగదు, సర్టిఫికెట్లతో సత్కరిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హస కళాకారుల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హస్తకళల కళాకారులు తయారు చేసిన వస్తువులను తక్కువ ధరలకే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మసూద్ అలీ, డిప్యూటీ మేనేజర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed