గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్

by Kalyani |
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలి :  కలెక్టర్
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా , పగడ్బందీగా జరిగేలా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై రీజినల్ కోఆర్డినేటర్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్స్ , డిపార్ట్మెంటల్ అధికారులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షకు హైదరాబాద్ జిల్లా నుండి 40,569 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని , ఇందు కోసం 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా 11 మంది రూట్ ఆఫీసర్లను, 5గురు రీజనల్ కోఆర్డినేటర్ లను, 77 మంది మెంటల్ అధికారులను ,5గురు రిజర్వ్, 16 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాష్ రూమ్స్, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు ప్రతి రూమ్ బయట ఉంచాలని,ఫాన్స్, లైట్స్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని ఎక్కడ ఇలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎగ్జామ్ క్యాంపస్ లోకి చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప ఎవరికి సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని కూడా అనుమతించ వద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జాయింట్ కస్టడియన్స్ కే. వీరబ్రహ్మ చారి, టి రవి, ఎం సూర్యప్రకాష్, ఎస్ రాజేష్ కుమార్, బి అపర్ణ, రీజనల్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎన్. చందన, డాక్టర్ లక్ష్మి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ బి సత్యనారాయణ, డాక్టర్ ఏ కృష్ణయ్య, డాక్టర్ రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed