నకిలీ బ్లూ డైమండ్ ను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

by Disha Web Desk 15 |
నకిలీ బ్లూ డైమండ్ ను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
X

దిశ,కార్వాన్ : మూడు కోట్ల విలువ చేసే నకిలీ బ్లూ డైమండ్ ను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం విలేకరులకు వివరాలను వెల్లడించారు. ముంబై విక్టరీ ఈస్ట్ ఠాగూర్ నగర్ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తేలూరి (48) ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే సులభంగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ బ్లూ డైమండ్ ను హైదరాబాద్ కు

తీసుకువచ్చి ప్రజలను మోసగించేందుకు నగరంలోని మరో ఇద్దరు మిత్రులు రియాసత్ నగర్, మిధాని బస్ డిపో ప్రాంతానికి చెందిన ముస్తాబా అహ్మద్ ఖాన్ (41), కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సాజిద్ అలీ (40) కలిసి బుధవారం హబీబ్ నగర్ ప్రాంతాలలో తిరిగి, తమ వద్ద మూడు కోట్ల విలువ గల డైమండ్ ఉందని, తమకు అత్యవసరంగా డబ్బులు అవసరంతో తక్కువకు 30 లక్షల కే విక్రయిస్తున్నట్లు తెలిపారు. దాంతో స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మూడు కోట్ల విలువ గల నకిలీ బ్లూ డైమండ్ ను విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ పేర్కొన్నారు. ఈ బ్లూ డైమండ్ విలువ 1000 రూపాయలు కూడా ఉండదని, ప్రజలను ఈ రకంగా మోసం చేసేందుకు బొంబాయి నుంచి మూఠాలు వచ్చి స్థానికులను మోసగిస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ పేర్కొన్నారు.

మరో ఘటనలో....

మల్లేపల్లి ప్రాంతానికి చెందిన హజార్ అహ్మద్ ఈనెల 23న రాత్రి బయటికి వెళ్లి, తిరిగి 24న తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉంది. ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపి చూసేసరికి, బ్యాగులో ఉన్న 16 తులాల బంగారు నగలతో పాటు 3900 సౌదీ రియాల్స్ కరెన్సీ, రెండున్నర లక్షల నగదు, ఓ ఐ ఫోన్, ట్యాబ్ కనిపించకుండా పోయింది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గురువారం నిందితున్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుని వద్ద 1,02,500 నగదు, 2400 రియాల్స్ కరెన్సీ, 11 తులాల బంగారం నగలు, ఓ సెల్ ఫోను, ట్యాబ్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ రాంబాబుతో పాటు క్రైమ్ పోలీసులను డీసీపీ అభినందించారు.


Next Story