పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోటి రూపాయలకు పైగా మోసం

by Disha Web Desk 11 |
పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోటి రూపాయలకు పైగా మోసం
X

దిశ, శేరిలింగంపల్లి : ఈజీ మనీకి అలవాటుపడిన దుండగులు ఇతరుల్ని ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చివరికి మ్యాట్రిమోనియల్ సైట్లను కూడా విడిచి పెట్టడం లేదు. ఆ వెబ్‌సైట్‌ల ద్వారా పరిచయం పెంచుకొని, పెళ్లి చేసుకుంటామని నమ్మంచి, చివరికి శఠగోపం పెట్టి ఉడాయిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగు చూసింది. పెళ్లి పేరుతో ఓ యువతిని బుట్టలో వేసుకొని ఆమె వద్ద నుంచి కోట్లాది రూపాయలు కాజేశాడు ఓ దుండగుడు. చివరికి తాను మోసపోయానని గుర్తించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ కు చెందిన మహిళకు గతంలోనే పెళ్లి అయ్యింది. అయితే ఆమె భర్త కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆమె రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో షాదీ డాట్ కామ్ లో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్ గమనించిన చిత్తూరు జిల్లా పాకాల మండలం వాపాల వారి పల్లెకు చెందిన కొమ్మినేని వంశీ చౌదరి, అలియాస్ వంశీకృష్ణ రెండో పెళ్లి కోసం షాదీ డాట్ కామ్ లో తన డీటెయిల్స్ పెట్టిన మహిళను ట్రాప్ చేసిన వంశీకృష్ణ (38)ఆమె ప్రొఫైల్ లో ఉన్న నెంబర్ కు కాల్ చేసి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, అమెరికాలో ఉంటున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

అమెరికా కు సంబంధించిన ఫోన్ నంబర్స్ తో కాల్ చేసి ఆమెను నమ్మించాడు. అలాగే గూగుల్ కంపెనీలో పని చేస్తున్నట్లు ఫేక్ ఐడి కార్డ్ కూడా మహిళకు చూపించాడు. వంశీకృష్ణను సదరు మహిళ నమ్మడంతో అతన్ని వాళ్ళ కుటుంబం సభ్యులకు కూడా పరిచయం చేసింది. అందరూ నమ్మడంతో తన ప్లాన్ ను ప్రారంభించిన వంశీ కృష్ణ..తన అకౌంట్స్ అన్ని ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఫ్రీజ్ చేసారని, తనకు డబ్బులు ఇబ్బంది అవుతుందని మహిళను నమ్మించాడు.

దీంతో అతనిపై ఉన్న నమ్మకంతో మహిళ క్రెడిట్ కార్డ్స్ తో పాటు ఇతర బ్యాంకు వివరాలు వంశీకృష్ణకు ఇచ్చింది. అదే అదునుగా భావించిన వంశీకృష్ణ ఆమె అకౌంట్ నుండి ఒక కోటికి పైగా నగదును వాడుకున్నాడు. ఆ తర్వాత వంశీకృష్ణ ఆ మహిళతో సరిగా మాట్లాడక పోవడం, ఆమె ఫోన్ చేసినా స్పందించక కపోవడంతో వంశీకృష్ణ మీద అనుమానం వచ్చిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వంశీకృష్ణను అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతని వద్ద నుంచి ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ఫేక్ కస్టమ్స్ బాండ్స్, ఫేక్ ఐడి కార్డ్స్ తో పాటుగా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed