భవిష్యత్ అంతా తెలంగాణదే: ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

by Disha Web Desk 19 |
భవిష్యత్ అంతా తెలంగాణదే: ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నా సొంత నిధులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నేడు అన్ని వరనులు సమకూరాయని, అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపాదికన ముందుకు సాగుతోందని అన్నారు.

కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితుల నుంచి వాటన్నింటిని అధిగమించి దేశం గర్వించేలా ముందుకు సాగుతున్నామని, తెలంగాణ అభివృద్ధికి బంగారు బాటలు వేస్తూ సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. భవిష్యత్ అంతా తెలంగాణదేనని, ఇంకా గొప్ప పాలనను దేశానికి అందించేందుకు కేసీఆర్ విజన్‌తో ముందుకు వెళుతున్నారని, పక్క రాష్ట్రాలు కూడా విజన్ ఉన్న కేసీఆర్‌నే నాయకుడిగా కోరుకుంటున్నాయని అన్నారు. బీజేపీకి సంక్షేమం అవసరం లేదని, వారికి సంక్షోభం సృష్టించడమే తెలుసని విమర్శించారు. దేశానికి బీఆర్ఎస్ మార్గనిర్ధేశం అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. వాటికి ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed