హైదరాబాద్ లో 6 , సికింద్రాబాద్ కు 9 నామినేషన్లు దాఖలు

by Disha Web Desk 11 |
హైదరాబాద్ లో 6 , సికింద్రాబాద్ కు 9 నామినేషన్లు దాఖలు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో వివిద పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు మంగళవారం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి 9 నామినేషన్లు , సికింద్రాబాద్ నియోజకవర్గానికి మరో 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా తాజాగా నమోదైన నామినేషన్లతో ఇప్పటివరకు హైదరాబాద్ స్థానానికి మొత్తం 21 నామినేషన్లు , సికింద్రాబాద్ లో మొత్తం 29 కి చేరింది .

హైదరాబాద్ లోక్ సభకు దాఖలైన నామినేషన్ల వివరాలు ...

1. బి.రాజేంద్ర కుమార్ (ఇండిపెండెంట్ అభ్యర్థి)

2. అంబి హనుమంతరావు, (సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా)3. గడ్డం హరీష్ ( ధర్మ సమాజ్ పార్టీ )

4. ముదావత్ రుక్మిణి నాయక్ (కాంగ్రెస్)

5. ఎల్ అశోక్ నాథ్ (తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ)

6. వి.శంకర్ ( యువతరం పార్టీ )

7. మాతంగి రమేష్ కుమార్ ( సకల జనుల పార్టీ)

8. బండేలా క్రాంతి కుమార్ ( ఇండియన్ నేషనల్ యువజన పార్టీ)

9. మహమ్మద్ వసి ఉల్లా సమీర్ (కాంగ్రెస్)

సికింద్రాబాద్ నియోజకవర్గం ...

1. పులిమామిడి వెంకటేష్ గుప్తా ( స్వతంత్ర)

2. క్రాంతికుమార్ బండేలా (ఇండియన్ నేషనల్ యువజన పార్టీ)

3. వెల్మర్తి రవికిరణ్ ( స్వతంత్ర)

4. బత్తుల రవి ( స్వతంత్ర)

5. మహ్మద్ అక్రమ్ అలీఖాన్ ( స్వతంత్ర)

6. పంపరి నర్సింహ నరేందర్ ( స్వతంత్ర)

7. రెడ్డిమళ్ల పార్వతి ( స్వతంత్ర)

8. ఉత్తం ప్రవీణ్ కుమార్ ( స్వతంత్ర)

9.గౌలికార్ సోని ( సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా)

10. వేణుగోపాలస్వామి బొనుమల్ల (కాంగ్రెస్)

11. పగిడిపల్లి శ్యాంసన్ ( విదుతలై చిరుతైగల్ కచ్చి)



Next Story

Most Viewed