హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

by Disha Web Desk 2 |
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్ బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి అధికారులు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేయగా ఈసీ సూచనల మేరకు సందీప్ శాండిల్యను హైదరాబాద్ సీపీగా సీఎస్ శాంతికుమారి నియమించారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed