Hyderabad Metro : ‘మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
Hyderabad Metro :  ‘మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు ఎక్కువగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు. మెట్రో జర్నీతో టైం కూడా సేవ్ అవుతుండటంతో చాలామంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే క్యాబ్‌లు, ఆటోల్లో ధరలు అధికంగా ఉండటం, ట్రాఫిక్ కారణంగా మెట్రో నగర వాసులకు ఫస్ట్ ఆప్షన్‌లా మారింది. అయితే ప్రయాణీకుల రద్దీకి సరిపోయే బోగీలు లేకపోవడంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

దీంతో మెట్రో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆగస్టు నుంచి మూడు అదనపు కోచ్ లను మెట్రో రైళ్లకు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 5.10లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్యాసింజర్ల రద్దీ, ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా మెట్రో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


Next Story

Most Viewed