ఆర్టీసీ బస్సులో మహిళల సీటు కోసం భర్తల బాహాబాహీ..! (వీడియో)

by Disha Web Desk 5 |
ఆర్టీసీ బస్సులో మహిళల సీటు కోసం భర్తల బాహాబాహీ..! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో/ మరిపెడ( తొర్రూర్): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పెట్టిన నాటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందులో మహిళల సీటు కోసం ఇద్దరు మగవాళ్లు గొడవకు దిగారు. ఆర్టీసీ బస్సులో భార్యల సీటు కోసం భర్తలు బాహామాహీకి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహాబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ వ్యక్తి కర్చీఫ్ వేశాడు. బస్సు రద్దీగా ఉండటంతో ముందుగా బస్సు ఎక్కిన మరో వ్యక్తి ఆ కర్చీఫ్ తీసి తన భార్యను కూర్చొబెట్టాడు.

అనంతరం బస్సు ఎక్కిన వ్యక్తి తాను కర్చీఫ్ వేసిన సీటులో మీరెలా కూర్చుంటారంటూ వాగ్వాధానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరినొకరు కాలర్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. పక్క వ్యక్తులు విడదీసే ప్రయత్నం చేసినా మరింత రెచ్చిపోయారు. వీరి గొడవ అనంతరం వారి భార్యలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. వీరి గొడవతో బస్సులోని తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

Click Here for Twitter video link



Next Story

Most Viewed