ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు తీర్పు.. సీబీఐకి అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 12 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు తీర్పు.. సీబీఐకి అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్ సమర్థించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసు సీబీఐతో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ 2022 డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ విషయమై విచారణ జరిపిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు వినగా...చీఫ్ జస్టిస్ బెంచ్ సీబీఐ విచారణకే మొగ్గుచూపింది. ఇక గత మూడు నెలలుగా ఈ కేసు పలుమలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. ఏసీబీ నుంచి సుప్రీంకోర్టు దాకా మొత్తం ఆరు కోర్టులు ఈ కేసును పరిశీలించాయి.

Read more:

తెలంగాణ బడ్జెట్ 2023 ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు..........తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రికార్డ్ స్థాయిలో బడ్జెట్


Next Story