Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

by Disha Web Desk 19 |
Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్- 2023ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 2,90,396 కోట్ల బడ్జెట్‌ను హరీష్ రావు ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం 2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం 37,525 కోట్లు కేటాయించారు. కరోనా సంక్షోభం వచ్చినా తెలంగాణ స్ట్రాంగ్ నిలదొక్కుకుందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని అనే స్థాయికి తెలంగాణ చేరుకుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటికి రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కానీ తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

తెలంగాణ బడ్జెట్ 2023: మొత్తం 2,90,396 కోట్లు.. రంగాలకు కేటాయింపులు ఇవే!

మొత్తం రూ.2,90, 396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11, 685కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు కేటాయించారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000కోట్లు, దళితబంధు పథకానికి రూ.17.700 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.12,000కోట్లు కేటాయించారు.

నీటి పారుదల: 26, 885 కోట్లు

విద్యుత్ కేటాయింపులు: 12,727 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థ: 3117 కోట్లు

ఆసరా ఫించన్లు్: 12,000 కోట్లు

దళిత బంధు: 17,700 కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధి: 36,750 కోట్లు

ఎస్టీ ప్రత్యేక నిధి: 15,233

బీసీ ప్రత్యేక నిధి: 6,229 కోట్లు

మహిళ శిశు సంక్షేమం: 2,131 కోట్లు

అటవీ శాఖ: 1,147 కోట్లు

విద్య రంగం: 19,093 కోట్లు

వైద్యం కోసం: 12, 161 కోట్లు

కల్యాణలక్ష్మీ పథకానికి - 2వేల కోట్లు

షాదీముబారక్ కోసం - 450 కోట్లు

వ్యవసాయ రంగానికి - 26,931 కోట్లు

నీటి పారుదల శాఖకు - 26,885 కోట్లు

మైనార్టీ సంక్షేమం - 2200 కోట్లు

రైతు రుణమాఫీ- 6385 కోట్లు

రైతు బంధు - 15075 కోట్లు

రైతు బీమా - 1589 కోట్లు

కేసీఆర్ కిట్ - 200 కోట్లు

హైదరాబాద్ ఎయిర్ పోర్టు - 500 కోట్లు

పాతబస్తీ మెట్రో - 500 కోట్లు

పౌరసరఫరాలు - 3000 కోట్లు

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023- 2024 ఆర్ధిక సంవత్సరానికి 2, 90, 395 కోట్ల బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతుల రుణమాఫీకి కోసం రూ. 6385 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల ఎఫెక్ట్.. నియోజకవర్గాలకు భారీగా నిధులు

తెలంగాణ బడ్జెట్ 2023లో నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎన్నికల ఏడాది కావడంతో స్పెషల్ డెవలప్ ఫండ్‌ను సర్కార్ భారీగా పెంచింది. గత ఏడాది రూ. 2 వేల కోట్లు కేయించగా.. ఈ సారి రూ. 10, 348 కోట్ల నిధులు కేటాయించారు. 2023-2024 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది.

తెలంగాణలోని వివిధ సంక్షేమ రంగాలకు నిధులివే..

ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు

ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు

గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగ‌తి నిధికి రూ. 15,223 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.

ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాంపులు ఇవే

సొంత జాగ ఉన్నవారికి రూ. 3 లక్షలు

సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సహయం చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 119 నియోజకవర్గాల్లో 2000 మందిని ఎంపిక చేసి మొత్తం 2,38,000 మంది లబ్దిదారులకు రూ.3 లక్షల సహయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో 7,890 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు శుభవార్త

బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు మధ్యాహ్న భోజన కార్మికులకు గుడ్ న్యూ్స్ చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. అంతేకాకుండా ఏప్రిల్ నుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చేపడతామని తెలిపారు. దీనితో పాటుగా సెర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ నుండి పే స్కేలు సవరణ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం అమలు చేస్తామని.. ఇందుకోసం ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Next Story