వాన మళ్లీ మొదలు.. ఈసారి ఎన్ని రోజులంటే ?

by Dishanational2 |
వాన మళ్లీ మొదలు.. ఈసారి ఎన్ని రోజులంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణను వర్షాలు వీడటం లేదు.ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. పలు జిల్లాలోని ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఈక్రమంలో తగ్గిపోయాయి అనుకున్న ప్రజలకు మరోసారి చేదు వార్త అందించింది వాతావారణ శాఖ. నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమిపైకి వచ్చిందని ఇది కాస్త సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి తోడు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వీటి కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముప్పు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావారణ శాఖ తెలిపింది.



Next Story

Most Viewed