కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా

by Disha Web Desk 13 |
కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. మార్చి 19న విచారిస్తామని శుక్రవారం సుప్రీంకోర్టు చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ సమర్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీంకోర్టులో గతేడాది సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన విచారణ తాజాగా మరోసారి వాయిదా పడింది.

కాగా లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నాయి. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు రాలేనని దర్యాప్తు సంస్థలకు కవిత సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు ఇటివల నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింత విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై ఆమె విచారణకు హజరుకాలేదు. దీంతో కవిత సీబీఐ, ఈడీ ముందు మళ్లీ హాజరుకావాలా లేదా అన విషయంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.


Next Story