సాక్ష్యాలు ధ్వంసం చేశారా? కవిత బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు

by Disha Web Desk 14 |
సాక్ష్యాలు ధ్వంసం చేశారా? కవిత బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న జడ్డి కావేరి భవేజా.. తీర్పును మే 2 వ తేదీకి రిజర్వ్ చేశారు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవ్వగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.

కవిత తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పది స్టేట్మెంట్స్ ఇచ్చారని, ఈడీ ఆయనను అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో బుచ్చిబాబు నాలుగు స్టేట్ మెంట్‌లు ఇచ్చారన్నారు. ఆ వెంటనే బుచ్చిబాబుకు బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఆదే తరహాలో స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందన్నారు. మాగుంట రాఘవ తండ్రికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఇవన్నీ కూడా ఈ కేసులో ముఖ్యమైనవని, పరీశీలనలోకి తీసుకోవాల్సి అంశాలన్నారు.

సాక్ష్యాలు ధ్వంసం చేశారా? : జడ్జి

సాక్ష్యాలు ధ్వంసం చేశారా? అని జడ్జి కావేరి బావేజా అడిగారు. తాము ఎక్కడా సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని కవిత న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో పని మనుషులకు ఇచ్చినవి ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోన్లలో డేటా లభించలేదని ఈడీ తెలిపింది.

కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

సీబీఐ అరెస్ట్ పై కవిత తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని, అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి కవిత స్టార్ క్యాంపైనర్ అని తెలిపారు. సీబీఐ వాదనలు వినిపిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కాంలో కవిత కీలకంగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Read More...

రేవంత్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? ఆ పని చేయకుంటే రాజీనామాకు సిద్ధమా?









Next Story

Most Viewed