ఒకే పార్టీలో ఉన్నామా లేక వేరే పార్టీలో ఉన్నామా? దానం నాగేందర్ క్యాంపెయిన్ బ్యానర్స్ పై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫైర్.. వాట్సాప్ చాటింగ్ వైరల్

by Disha Web Desk 13 |
ఒకే పార్టీలో ఉన్నామా లేక వేరే పార్టీలో ఉన్నామా? దానం నాగేందర్ క్యాంపెయిన్ బ్యానర్స్ పై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫైర్.. వాట్సాప్ చాటింగ్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల వేళ సికింద్రాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. ప్రచార ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ విషయంలో సమన్వయం లోపించిందనే ప్రచారం చర్చగా మారింది. తమ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. పార్టీ ప్రచార ఫ్లెక్సీల్లో తన ఫోటోలు పెట్టకపోవడంపై తాజాగా విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేసినట్లుగా ఓ వాట్సాప్ గ్రూప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ప్రకారం ‘సికింద్రాబాద్ పార్లమెంట్’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార ర్యాలీకి సంబంధించిన ఓ బ్యానర్ ఫోటోను గ్రూప్ లో వేశారు. ఇందులో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఫోటోలు మిస్ అయ్యాయి. దీంతో ‘మీ ప్రోటోకాల్‌లో ఎల్లప్పుడూ మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు ఎలా మిస్ అవుతున్నాయి? ఇంతకు మనం ఒకే పార్టీలోనే ఉన్నామా లేక ఇతర పార్టీలో ఉన్నామా?’ అని విజయలక్ష్మి అదే గ్రూప్ లో ప్రశ్నించారు. దీంతో ఈ మెసేజ్ గమనించిన గ్రూప్ అడ్మిన్ వెంటనే విజయలక్ష్మి చాటింగ్ ను డిలీట్ చేశారు. గ్రూప్ లో జరిగిన చాటింగ్ సంభాషణను ఎవరో స్క్రీన్ షార్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలను ప్రత్యర్థులు షేర్ చేస్తూ కాంగ్రెస్ లో ఐక్యత లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ముగ్గురు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఇటీవలే వీరు పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed