గవర్నర్‌కు అయోధ్య అక్షింతలు.. రాజ్ భవన్‌లో హోరెత్తిన ‘జై శ్రీరామ్’ నినాదాలు

by Disha Web Desk 2 |
గవర్నర్‌కు అయోధ్య అక్షింతలు.. రాజ్ భవన్‌లో హోరెత్తిన ‘జై శ్రీరామ్’ నినాదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను తెలంగాణ తొలి పౌరురాలు తమిళి సై సౌందర రాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌ను సోమవారం కలిసి వారు అక్షింతలు అందజేశారు. జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్షింతలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ చేతులమీదుగా ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. గవర్నర్‌ను సైతం రామమందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా స్పందిచిన తమిళి సై దర్శనానికి తప్పకుండా వస్తానని చెప్పిందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలతో రాజ్ భవన్ పరిసరాలు హోరెత్తినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రతి హిందువు అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, విశ్వహిందూ పరిషత్ బాధ్యుడు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, జగదీశ్వర్, డాక్టర్ రామ్ సింగ్, నరసింహమూర్తి, సునీత రామ్మోహన్ రెడ్డి, భాను ప్రసాద్, పగుడాకుల బాలస్వామి, శివరాములు, పద్మశ్రీ, వాణి సక్కుబాయి, సింధుజ, అనిల్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed