రైతులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
రైతులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం అక్కడ సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఉచిత విద్యుత్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ వంటి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ వస్తారని అన్నారు. అంతేకాదు.. మార్చి 2వ తేదీన మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపైనా త్వరలో శుభవార్త చెబుతామని అన్నారు. సమ్మక్క - సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు.

గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే ‘హాత్ సే హాత్’ జోడోయాత్ర ప్రారంభించినట్లు గుర్తుచేశారు. తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనతోనేనని.. అందుకే జాతరకు రూ.110కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. జాతరకు 18 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వచ్చారని తెలిపారు. సమ్మక్క - సారలమ్మలను నమ్ముకున్న జనం కోసం వారు అప్పటి పాలకులతో కొట్లాడి అమరులయ్యారని అన్నారు. తాము కూడా అమ్మవార్లనే స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ఎజెండాతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Next Story

Most Viewed