మా వాళ్లను మాకివ్వండి.. ఏపీ నుంచి డీఓపీటీకి లేఖ

by Rajesh |
మా వాళ్లను మాకివ్వండి.. ఏపీ నుంచి డీఓపీటీకి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమకు కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. అలాగే ఏపీలో పనిచేస్తోన్న తెలంగాణ కేడర్ ఆఫీసర్లను రిలీవ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల వ్యవహారాలను పర్యవేక్షించే (డీఓపీటీ)కి ఏపీ సర్కారు లేఖ రాసింది. దీనితో ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను వెంటనే రిలీవ్ చేయాలని డీఓపీటీ నుంచి రాష్ట్రప్రభుత్వానికి లెటర్ వచ్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర విభజన సమయంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన జరిగింది. అయితే కొందరు ఆఫీసర్లు తాము ఇచ్చిన ఆప్షన్‌కు విరుద్ధంగా డీఓపీటీ తమకు కేడర్ కేటాయించిందని కోర్టుకు వెళ్లారు. నాలుగైదేళ్ల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్టు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఉండటంతో ఇంతకాలం తీర్పు అమలు వాయిదా పడింది.

చంద్రబాబు ఒత్తిడి

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన ప్రభుత్వంలో కొత్త ఐఏఎస్ ఆఫీసర్లను నియమించుకునేందుకు ప్రయారటీ ఇస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో పనిచేస్తోన్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను వెంటనే తమకు పంపాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూడా వెంటనే సదరు అధికారులను ఏపీకి రిలీవ్ చేయాలని, అదే సమయంలో ఏపీలో పనిచేస్తోన్న తెలంగాణ కేడర్ ఆఫీసర్లను జాయిన్ చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. అయితే ఏపీ కేడర్ అధికారులను ఆ రాష్ట్రానికి పంపడంపై సీఎం రేవంత్‌రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐఏఎస్‌ల బదిలీలపై కసరత్తు జరుగుతోన్న సమయంలో డీఓపీటీ నుంచి లేఖ రావడంతో ట్రాన్స్‌ఫర్ లిస్టులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తున్నది.

రాష్ట్రంలో పనిచేస్తోన్న ఏపీ కేడర్ ఆఫీసర్లు

వాకాటి కరుణ, ఐఏఎస్

రోనాల్ట్ రాస్, ఐఏఎస్

వాణి ప్రసాద్, ఐఏఎస్

అమ్రపాలి, ఐఏఎస్

ప్రశాంతి, ఐఏఎస్

అంజన్ కుమార్, ఐపీఎస్

అభిలాష్ బిస్తే, ఐపీఎస్

అభిషేక్ మహంతి, ఐపీఎస్

ఏపీలో పనిచేస్తోన్న

తెలంగాణ కేడర్ అధికారులు

హరిచరణ్, ఐఏఎస్

శ్రీజన, ఐఏఎస్

శివశంకర్, ఐఏఎస్

Read More..

18వ లోక్ సభ: బీజేపీ నెంబర్ 1, టీడీపీ నెంబర్ 6, వైసీపీ 15వ స్థానంNext Story

Most Viewed