18వ లోక్ సభ: బీజేపీ నెంబర్ 1, టీడీపీ నెంబర్ 6, వైసీపీ 15వ స్థానం

by Mahesh |
18వ లోక్ సభ: బీజేపీ నెంబర్ 1, టీడీపీ నెంబర్ 6, వైసీపీ 15వ స్థానం
X

దిశ, వెబ్ డెస్క్: 2024 లో 18 వ లోక్ సభకు ఎన్నికలు జరగ్గా.. ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన లోక్ సభ స్థానాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. మొత్తం 41 పార్టీలు ఉండగా.. ఇందులో 240 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది.. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. అలాగే 99 స్థానాలతో కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉండగా.. 37 మంది సభ్యులతో సమాజ్ వాదీ పార్టీ మూడో స్థానంలో, 29 మంది ఎంపీలతో టీఎంసీ నాలుగో స్థానంలో,, 22 మందితో డీఎమ్‌కే ఐదో స్థానంలో ఉండగా.. 16 మందితో టీడీపీ 6వ స్థానంలో ఉంది. అలాగే నలుగురు ఎంపీలతో వైసీపీ 15వ స్థానంలో ఉంది. కాగా 17వ లోక్ సభలో వైసీపీ 22 మంది ఎంపీలతో ఉంది. ఇదిలా ఉంటే 18వ లోక్ సభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం గమనార్హం.

Also Read: శారదా పీఠం నుంచే.. దేవాదాయ శాఖ ప్రక్షాళనNext Story

Most Viewed