గ్రూప్-1 ప్రిలిమ్స్: 500 మంది అభ్యర్థులకు ఉచిత టెస్ట్ సిరీస్

by GSrikanth |
గ్రూప్-1 ప్రిలిమ్స్: 500 మంది అభ్యర్థులకు ఉచిత టెస్ట్ సిరీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా టెస్ట్ సిరీస్ నిర్వహించనున్నట్లు 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు కావడంతో అభ్యర్థులు ఆర్థికంగా, మానసికంగా ఆందోళనలో ఉన్న నేపథ్యంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లాటరీ పద్ధతిలో 500 మందిని ఎంపిక చేసి వారికి ఉచిత టెస్ట్ సిరీస్ నిర్వహించనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ టెస్ట్ పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో ఉంటుందని వెల్లడించారు. కావున అభ్యర్థులు తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి బ్యాచ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 040-35052121, 9133237733 నంబర్ కు సంప్రదించాలని సూచించారు.



Next Story

Most Viewed