అంగన్‌వాడీ టీచర్లకు బిగ్ అలర్ట్..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

by Disha Web Desk 18 |
అంగన్‌వాడీ టీచర్లకు బిగ్ అలర్ట్..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడీ సిబ్బందికి శుభవార్త తెలిపింది రేవంత్ సర్కార్.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలు పంపాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్క్స్ మెమో ప్రకారం గుర్తించాలని సూచించారు. ఇవేమి లేకుంటే వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.

సంబంధిత వివరాల ప్రకారం ఏప్రిల్ 30 నాటికి పంపించాలని అధికారులకు ఆదేశాలు పంపించారు. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ సిబ్బందికి ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న అంగన్ వాడీ టీచర్లు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

Read More...

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed