నల్లగొండ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే.. ఆ రూట్‌లో వెళ్తాం: మాజీ MP వినోద్

by Disha Web Desk 19 |
నల్లగొండ సభకు పర్మిషన్ ఇవ్వకపోతే.. ఆ రూట్‌లో వెళ్తాం: మాజీ MP వినోద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం పెట్టిన పేర్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని, పేర్లు మారిస్తే ప్రయోజనం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నోసార్లు చర్చలు జరిపి జిల్లాలు ఏర్పాటు చేశామని, జిల్లాల పునర్విభజన పేరుతో మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఇది ఉద్యోగాల భర్తీ పై ప్రభావితం చేస్తోందన్నారు. లక్షా 90 వేల ఖాళీ ఉద్యోగాలు నెల రోజుల్లో గుర్తించాలని, బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు తమ దగ్గర ఉన్నాయని, 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

కాలయాపన చేయకుండా ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోదండరాంకు ఎమ్మెల్సీగా బాధ్యతలు పెరిగాయని, ఆయన నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, ఈ ఏడాది చివరి నాటికి భర్తీ జరిగేలా చూడాలని సూచించారు. ఎంపీ నేతకాని వెంకటేష్ పార్టీ మారి విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో తేలిపోయిందని దుయ్యబట్టారు. నల్లగొండలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోతే న్యాయ స్థానం ద్వారా అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed