కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ: జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని చెప్పారు. అందుకే ప్రజలు అధికార బలంగా ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలను రాజకీయంగా దెబ్బతీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నేతలకు మరోసారి బుద్ధి చెప్పాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదని అన్నారు.

అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా హామీలు అమలు చేయలేదని అన్నారు. దళితబందు, బీసీబంధు వంటి అన్నీ స్కీముల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకున్నారని.. స్వయంగా తెలంగాణ భవన్‌లో నాటి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

Next Story