రైతు భరోసా ఏమైంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 16 |
Minister Srinivas Goud Gun Firing in the air in Freedom Rally
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుక బలంగా వినబడాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. కనీసం పార్లమెంటు ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అమలు చేస్తామన్న హామీలు అమలు చేస్తారో చూడాలన్నారు. కేసీఆర్ పాలనలో చెప్పినవి చెప్పనవి కూడా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారని, మరి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజలను ఎప్పటికపుడు అప్రమత్తం చేయనున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే అందరికన్నా సంతోష పడే వాళ్ళం తామేనన్నారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడాల్సిందేనని, బీఆర్ఎస్ క్రమ శిక్షణ గల పార్టీ అని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.


Next Story