అగ్ని ప్రమాద స్థలికి గంగుల కమలాకర్.. ప్రభుత్వం ఎదుట కీలక డిమాండ్

by Disha Web Desk 2 |
అగ్ని ప్రమాద స్థలికి గంగుల కమలాకర్.. ప్రభుత్వం ఎదుట కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్లు పేలి కార్మికులు నివసించే గుడిసెలు దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సమ్మక్క-సారలమ్మ జాతర నిమిత్తం గుడిసెల్లో నివసించే కార్మికులు మేడారం వెళ్లారని చెప్పారు. సుమారు ఇక్కడ 40 నుంచి 45 గుడిసెలు ఉన్నాయని అన్నారు.

అయితే, వారు మేడారం వెళ్లే సమయంలో ఇంట్లో వన దేవతలకు దీపం పెట్టారని.. ఆ దీపాలు కాస్త ఇంటికి అంటుకొని మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానించారు. మొత్తం ఎనిమిది సిలిండర్లు, 40 నుంచి 45 గుడిసెలు కూడా కాలిపోయాయని తెలిపారు. అంతా జాతరకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ, భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి వారిమీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వీరందరికి పక్కా ఇళ్లు కట్టించాలి’ అని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పరిహారంగా వీరందిరికీ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు.


Next Story

Most Viewed