తుమ్మల రాక కోసం.. భారీ ఏర్పాట్లు చేస్తున్న అనుచరులు

by Disha Web Desk 10 |
తుమ్మల రాక కోసం.. భారీ ఏర్పాట్లు చేస్తున్న అనుచరులు
X

దిశ, ఖమ్మం రూరల్​: బీఆర్ఎస్ ​అదిష్టానం ఈనెల 21న సీట్లు కేటాయింపులో జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీటు కేటాయించలేదు. దీంతో గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అనుచరులు, అభిమానులు రహస్య సమావేశాలు, భవిష్యత్​కార్యచరణపై సమావేశాలు నిర్వహించారు. తుమ్మలను బీఆర్ఎస్‌లోనే ఉంచాలని అదిష్టానం ప్రయత్నంలో భాగంగా దూతలను పంపిన విషయం తెలిసిందే. కానీ తుమ్మల మాత్రం మౌనాన్ని వీడలేదు. పార్టీలైన్​లోనే ఉన్నారా..? లేకా గీత దాటారా..? అనే సందేహాం అందరికి తడుతున్నది. ఈ తరుణంలోనే నేడు ఖమ్మంకు రానున్న తుమ్మలకు తన అభిమానులు, వర్గీయలు పది నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి, స్వాగతం పలికేందుకు శ్రేణులు సన్నహలు పూర్తి చేశారు. తొలిసారిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్​ జెండాలు లేకుండా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖమ్మంలోని స్వగృహం గొల్లగూడెం వరకు రెండు వేల కార్లు, మూడు వేలకు పైగా బైకులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే గురువారం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ముఖ్య నాయకులు సమావేశమై స్వాగత ఏర్పాట్లకు ప్లాన్​చేశారు. తుమ్మల వర్గ ముఖ్య నాయకుడు సాధు రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మల స్వాగతానికి అభిమానులు, వర్గీయలే స్వతహాగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తుమ్మల నిర్ణయంతో అందరం ముందుకు నడుస్తామని దానిలో ఎటువంటి తేడాలేదన్నారు. జిల్లా సమాగ్రాభివృద్ధిలో తుమ్మల పాత్రకీలకం అని అ విషయం జిల్లా ప్రజలకు, మరి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు తెలుసనని తెలిపారు. ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు.

మనస్సు మార్చుకోని తుమ్మల

తుమ్మల మనస్సు మార్చేందుకు పార్టీ లైన్​లోనే ఉండేలా పలువురు దూతలు బాధ్యత తీసుకున్న ఆ చర్చలు ఏమి ఫలించలేదని తెలిసింది. అయితే చివరిగా ఎంపీ నామాతో చర్చించిన తరువాత ఏమైన మనస్సు మార్చుకున్నారా..? అనే సందేహం నెలకొంది. ఏది ఎమైనా నేడు జరిగే ర్యాలీ సభలో తుమ్మల మనస్సులో మాట బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని పైనే జిల్లా పార్టీ భవిష్యత్తు కూడా ఉంటుందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed