Aadhar Card : మీ ఆధార్ కార్డుతో ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి!

by Disha Web Desk 4 |
Aadhar Card : మీ ఆధార్ కార్డుతో ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరి ఆధార్ కార్డుపై మరొకరు తెలియకుండానే ఫోన్ నంబర్లు తీసుకుని నేరాలకు పాల్పడితే చిక్కులు వస్తుండటంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మన పేరు మీద మనకు తెలియకుండానే ఎవరైనా ఫోన్ నంబర్ తీసుకుని వాడితే ఆ నంబర్ ను బ్లాక్ చేసుకునే వెసులు బాటు కల్పించింది.

దీంతో పాటు ఒక ఆధార్ కార్డుతో గురిష్టంగా 9 సిమ్ కార్డులు తీసుకునేలా అనుమతించింది. ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు అవసరం అనుకుంటే రీ వెరిఫికేషన్ తప్పని సరి చేసింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉన్నందున తమ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ఒక వెబ్ సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మొబైల్‌ను ఎవరైనా చోరీ చేసినా పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

తెలుసుకోవడం ఇలా..

తొలుత https://tafcop.sancharsaathi.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్, నౌ యువర్ మొబైల్ కనెక్షన్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.

రెండో ట్యాబ్ పై క్లిక్ చేస్తే వినయోగదారుడి 10 అంకెల మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలని సూచిస్తుంది.

అందులో ఏదైనా నంబర్ మీది కాకపోయినా, ప్రస్తుతం ఆ నంబర్ ను వినియోగించకపోయినా దానికి బ్లాక్ చేసే ఆప్షన్ ను అందుబాటులో ఉంచారు.



Next Story

Most Viewed