యాదాద్రి: 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

by Disha Web Desk 2 |
యాదాద్రి: 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను స్కూళ్లను అభివృద్ధి చేస్తామని ప్రముఖ సిటీ నటి మంచు లక్ష్మి హామీ ఇచ్చింది. మంగళవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులతో మంచు లక్ష్మి, నటుడు మంచు మనోజ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను వారు దత్తత తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్‌ క్లాసెస్‌ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 1 నుంచి 5 తరగతుల వరకు మూడేళ్ల పాటు స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అయితే పిల్లలు చదువును మధ్యలోనే ఆపేయకూడదు అన్న ఉద్దేశంతో మంచు లక్ష్మి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ పెళ్లి వీడియో.. ఫ్యాన్స్ ఎమోషనల్



Next Story

Most Viewed