ఫేక్ న్యూస్ పెడ్లర్ CM రేవంత్ రెడ్డి.. KTR సంచలన ట్వీట్

by Rajesh |
ఫేక్ న్యూస్ పెడ్లర్ CM రేవంత్ రెడ్డి.. KTR సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బంధువుకు రూ.10వేల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యూలేట్ చేసిన వ్యక్తి సీఎం రేవంత్ అన్నారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశాడని సీరియస్ అయ్యారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

Click Here For Twitter Post..

Next Story