‘తాము గేట్లు తెరిస్తే.. కాంగ్రెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు’

by GSrikanth |
‘తాము గేట్లు తెరిస్తే.. కాంగ్రెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు’
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకత్వం స్పీడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా.. గురువారం కరీంనగర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలపై స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌తోనే ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి తమ ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మేము గేట్లు తెరిస్తే.. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో ఒక్కరిని చేర్చుకుంటే.. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తాము చేర్చుకుంటామని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story