కాంట్రాక్టర్లను భయపెడుతున్న ఎలక్షన్ కోడ్.. ఆ అంశంలో టెన్షన్!

by Disha Web Desk 4 |
కాంట్రాక్టర్లను భయపెడుతున్న ఎలక్షన్ కోడ్.. ఆ అంశంలో టెన్షన్!
X

ప్రభుత్వ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎగబడేవారు. కొట్టుకునేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌ అయింది. ప్రభుత్వ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మళ్లీ.. మళ్లీ టెండర్లు పిలిచినా.. దాఖలు చేసేవారు లేరు. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పనులు చేయించలేమంటూ రద్దుకు సిఫార్సు చేసుకునే దుస్థితిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ బరిలో ఉంటారని నాయకులు చెబుతున్నారు. బరిలో ఉండి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ బూత్‌ల ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ఒక వర్గంలో మాత్రం ఆందోళన నెలకొంది. ఈ నెల 2వ వారంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వస్తుందన్న పుకార్లు కొందరిలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్ల సంగతి దేవుడెరుగు, నామినేషన్ పద్ధతిలో గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ పనులు చేసిన చోటామోట కాంట్రాక్టర్లు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా అధికార పార్టీని నమ్ముకుని, చేసిన పనులకు బిల్లులు రాక వారిలో ఆందోళన నెలకొంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప్పల సాయినాథ్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. తాను గ్రామంలో చూట్టు ప్రక్కల ప్రాంతాలలో రూ.4 కోట్ల పనులు చేసిన సంబంధిత బిల్లులు రాకపోవడంతో తనకు చావే శరణం. గ్రామ పంచా యతీ పనులు చేసిన వారిని కాపాడాలని లేకపోతే తనకు చావే శరణ్యం అంటూ సీఎం కేసీఆర్‌కు వాట్సప్ మెసేజ్ చేసి మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపింది.

అతన్ని అధికార పార్టి నేతలు ఎలాగోలా పట్టుకుని జిల్లాకు తీసుకువచ్చారు. కాగా గ్రామాలలో పనులు చేసిన కాంట్రాక్టర్‌ల దయనీయ పరిస్థితికి సీఎం కేసీఆర్‌కు చేసినా మెసేజ్ అద్ధం పడుతోంది. ఎన్నికల కోడ్ వస్తే తనకు రావాల్సిన బిల్లులు కొత్త గవ ర్నమెంట్‌లో తీసుకోవాల్సి వస్తుందని తమకు అత్యంత భారమని చిన్న లీడర్లు వాపోతున్నారు. ప్రభుత్వం వద్ద నిధుల లేమి లేదని చెబు తుండగా తాము చేసిన పనులకు మాత్రం నెలలు, సంవత్సరాలు గడిచినా బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో చాలనే పనులు జరిగాయి. వాటిని క్లాస్ కాంట్రాక్టర్‌లు చేయగా వారికి పనులు చేసినందుకు కోటేషన్‌కు మించి డబ్బులు చెల్లించడంతో వారితో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎటొచ్చి నామినేషన్ పద్దతిలో టెండర్‌లు లేకుండానే పనులు చేసిన వారికి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కాని గ్రామాలలోకి వచ్చే సరికి గ్రామ పంచాయతీలు, అంగన్ వాడీ భవనాలు, మండల సమాఖ్య భవనాలు, అధనపు తరగతుల గదుల భవనాల నిర్మాణానికి ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో జరిగాయి. అందులో చాలా వరకు నిధులు రాగా వాటిని ఇతరత్ర పనులకు మళ్లించారు.

అంతే గాకుండా జీపీలలో ట్రాక్టర్‌ల కొనుగోలు‌తో పాటు ఇతర పనులకు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఏ మూలకు సరిపోలేదు. ఓక్క కామారెడ్డి జిల్లాలో ఎన్ఆర్ ఇజిఎస్ నిధుల బిల్లులు కోట్లలో రావాల్సి ఉంది. కేంద్రం జాతీయ ఉపాధి హమీ పధకం క్రింద ఇచ్చిన నిధులను జీపీలలో వర్క్ కాంపో నేంట్‌గా మార్చి పనులు చేయడం వలన నిధుల లేమి ఏర్పడింది అనేది ప్రధాన వాదన ఉంది. అంతే గాకుండా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల చాల రోజుల క్రితం వరకు అగిపోయాయి. దానితో ఏళ్ళ తరబడి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పనుల కోసం తెచ్చిన డబ్బులకు వడ్డిలు కట్టలేక చోటామోటా ప్రజాప్రతినిధులు, లీడర్లు సతమతమవుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో 23 మండలాల్లోని 526 గ్రామ పంచాయతీల్లో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించి రూ.43 కోట్ల 90 లక్షల 47 వేల 462 పెండింగ్ బిల్లులున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.46,12, 20,122 రావాల్సి ఉంది. వివిధ సంస్థల ద్వారా మొత్తం రూ.90 కోట్ల బిల్లులు కేవలం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రావాల్సి ఉంది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులే రూ.9, 27,25,957 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ఎన్ఆర్ఈజీఎస్‌కు సంబంధించిన నిధుల వివరాలను పంచాయితీ అధికారులు, ఉపాధి హామీ అధికారులు వెల్లడించడం లేదు. దాదాపు రూ.100 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే చిన్నచితక నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ల తాలూకు సంబంధించిన బిల్లులు రూ.200 కోట్ల పైచిలుకు రావాల్సి ఉండగా నిధుల లేమితో వాటిని విడుదల చేయడం లేదని చెబుతున్నారు. నిధుల లేమి లేదని అభివద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మాటలకు పనులకై లక్షలు వెచ్చించి బిల్లులు కోసం ఎదురు చూస్తున్న చోటా మోటా లీడర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎలక్షన్ కోడ్ రాకముందే తమకు డబ్బులు వస్తాయో రావోనని ఆందోళన నెలకొంది.

Next Story