టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ షురూ

by Disha Web Desk 12 |
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ షురూ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారుల విచారణ మొదలు పెట్టింది. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ అధికారులు వీడియో కెమెరాలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు. లీకేజీ కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మొదటి ఇద్దరు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ప్రత్యేక గదిలో ప్రశ్నించారు. ఎన్ని పేపర్లు తస్కరించారు? ఏయే పేపర్లు? ఎవరెవరికి? ఎంతకు? అమ్మారు? అన్న అంశాలపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారింది? ఏ పద్ధతిలో లావాదేవీలు జరిగాయి? అన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నట్లు తెలియవచ్చింది.

Next Story

Most Viewed