జోయ్ అలుకాస్‌కు భారీ షాక్.. వందల కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

by GSrikanth |
జోయ్ అలుకాస్‌కు భారీ షాక్.. వందల కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: జోయ్ అలుకాస్ సంస్థ యజమాని జోయ్ అలుకాస్ వర్గీస్‌కు చెందిన 305.84 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అధికారులు శుక్రవారం జప్తు చేశారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి జోయ్ అలుకాస్ వర్గీస్ కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తెప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఇటీవల జోయ్ అలుకాస్ చైర్మన్ ఇంటితో పాటు కార్యాలయాలపై దాడులు చేశారు.

తనిఖీల్లో కోట్లాది రూపాయలను హవాలా ద్వారా దుబాయ్ పంపి అదే మొత్తాలను కంపెనీలో పెట్టుబడులుగా తెప్పించుకున్నట్లుగా వెళ్లడైంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు జోయ్ అలుకాస్‌కు త్రిస్సూర్ శోభా సిటీలో ఉన్న 81.54 కోట్ల స్థిరాస్థులు, మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న 91.22 లక్షల నగదు, 5.58 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువ చేసే కంపెనీ షేర్‌లను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed