ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలి : అనుదీప్ దురిశెట్టి

by Aamani |
ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలి : అనుదీప్ దురిశెట్టి
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ మురాదాబాద్, చాచా నెహ్రూ నగర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ,అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మత్తు పనులను పరిశీలించి, విద్యార్థులకు నోటుబుక్కులు అందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రలను పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అందంగా, ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. పాఠశాలకు కావలసిన బెంచీలను అందించాలని, ఒక టీచర్ ను డిప్యూటేషన్ పై వేయాలని డీఈఓ ను, అంగన్వాడి కేంద్ర డీడబ్ల్యుఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు యాదయ్య, డిప్యూటీ ఈ ఈ వెంకటేశ్వర్లు, ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ సాజిద్, వసుధ తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed