స్టూడెంట్స్ అలర్ట్: అక్టోబర్ 1 నుంచి 'దోస్త్' స్పెషల్ ఫేజ్

by Disha Web Desk 19 |
స్టూడెంట్స్ అలర్ట్: అక్టోబర్ 1 నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాల్లో సీట్లు పొందని విద్యార్థులకు ఉన్నత విద్యామండలి స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి 'దోస్త్' స్పెషల్ ఫేజ్ కు ఆహ్వానిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి అదే నెల 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను 7వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాగా 9వ తేదీన సీట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ను అక్టోబర్ 9, 10 తేదీల్లో చేసుకోవాలని సూచించారు. 10, 11 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. కాగా దోస్త్ కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు రూ.,400 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు పొందని అభ్యర్థులు వారికి కేటాయించిన దోస్త ఐడీ, పిన్ నంబర్ ఆధారంగా స్పెషల్ ఫేజ్ లో పాల్గొనవచ్చన్నారు. ఇదిలా ఉండగా ఇంట్రాకాలేజీ వెబ్ ఆప్షన్లను ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈనెల 29న సీట్లను కేటాయించనున్నారు.

దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు మరోరోజు గడువు పొడిగింపు..

ఇదిలా ఉండగా డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు మరొకరోజు గడువు పొడిగించారు. శనివారం(ఈనెల 24) వరకు అభ్యర్థులు వారికి కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి అధికారులు సూచించారు.


Next Story

Most Viewed