దొరలూ, రెడ్లే అధికారంలో ఉండాలా ? RSP ఫైర్

by Disha Web Desk 4 |
దొరలూ, రెడ్లే అధికారంలో ఉండాలా ? RSP ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో అధికారంలో కేవలం రెడ్లు , దొరలూ మాత్రమే పాలించాలా? అని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 90 శాతం వున్న బడుగు, దళిత గిరిజన మైనార్టీలు రాజ్యాధికారానికి చేజిక్కించుకోకుండా అగ్రకుల నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీల నుండి చేరికల సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. రాష్టంలో మొత్తం బీసీల జనాభా ప్రకారం 60 సీట్లలో బీసీలు ఎమ్మెల్యేలుగా ఉండాలని , కానీ ఇప్పడు కేవలం 23 మంది మాత్రమే వున్నారన్నారు. వారి స్థానాల్లో రెడ్లు, వెలమ దొరలూ పోటీ చేస్తూ బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినప్పుడే ఈ రాష్టం బాగుపడుతుందన్నారు.

సూర్యాపేట జిల్లాలో బీసీ నాయకుడు జానయ్యపై అధికార పార్టీకి చెందిన మంత్రి కె. జగదేశ్ రెడ్డి కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. జానయ్య పై 70 కేసులు పోలీసుల చేత మంత్రి నమోదు చేయించారని తెలిపారు. చట్టం అందరికి సమానంగా ఉండాలన్నారు. కానీ పోలీసులు అధికార పార్టీ నేతలు ఎలా చెబితే ఆలా నడుచుకుంటూ బీఎస్పీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమయం ఎప్పుడు ఒకేలా వుండదని పోలీసులు చట్టాన్ని అనుసరించి వ్యవహరించాలని డీజీపీకి అయన విజ్ఞప్తి చేసారు. రాష్టంలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు, కల్వకుంట కవితకు సంబందించిన ఫ్లెక్సీలు ఉండాలి.. ఇతరులవి ఉండకుండా చించి వేస్తున్నారని అయన దుయ్యబట్టారు. వీరి పర్యటనలు ఉన్నప్పుడల్లా పోలీసులు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని అయన తప్పుబట్టారు.



Next Story