ఫుల్ జోష్‌లో తెలంగాణ టీడీపీ.. గ్రామాల్లో పండుగ వాతావరణం

by GSrikanth |
ఫుల్ జోష్‌లో తెలంగాణ టీడీపీ.. గ్రామాల్లో పండుగ వాతావరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం ప్రోగ్రామ్ ఊపందుకుంది. అన్ని పార్లమెంటు నియోజ‌క‌ర్గాల‌ పరిధిలో కొనసాగుతుంది. టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇచ్చిన పిలుపు మేర‌కు పల్లెలు, పట్టణాల్లో పార్టీ శ్రేణులు మ‌రింత జోరు పెంచారు. శుక్రవారం ఇంటింటికీ తిరిగి పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వహించారు. కాల‌నీలు, ప్రధాన కూడ‌ళ్లలో పార్టీ జెండాల‌ను ఎగుర‌వేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆడ‌ప‌డుచుల‌కు బొట్టు పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను క‌ర‌ప‌త్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. మంచికోసం టీడీపీ ఆద‌రించాల‌ని కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో ఇంటింటికీ టీడీపీ ప్రోగ్రామ్ కో- ఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed