రంజిత్ రెడ్డి ఆస్తులు.. ఐదేళ్లలో ఎంత మేర పెరిగాయంటే?

by Disha Web Desk 14 |
రంజిత్ రెడ్డి ఆస్తులు.. ఐదేళ్లలో ఎంత మేర పెరిగాయంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మంగళవారం రాజేంద్రనగర్‌లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా.. రంజిత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయనకు ప్రస్తుతం రూ. 435 కోట్ల ఆస్తులున్నాయి. 2019లో ఆయన ఆస్తులు రూ.163 కోట్లు ఉండేది. గత ఐదేళ్లలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పనిచేసిన సమయంలో ఆయన కుటుంబ ఆస్తులు 166 శాతం పెరిగాయి. రాజేశ్వర హేచరీస్, రాజేశ్వర ఫీడ్, రోహిణి మినరల్స్, రోహిణి ఇస్పాత్, డీఎస్ఆర్ ఎస్ఆర్ ఇన్‌ఫ్రా ఇతర సంస్థల్లో షేర్ల రూపంలో రూ.294 కోట్ల విలువైన చరాస్తులను రంజిత్ రెడ్డి ఫ్యామిలీ కలిగి ఉంది.

మేడ్చల్, ఇర్బహీంపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భూములు, భవనాల రూపంలో రూ.141 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు. రంజిత్‌కు రూ.22 కోట్ల అప్పులు ఉన్నాయి. అతను ఒక క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్సెస్ మాస్టర్ సాధించారు.



Next Story

Most Viewed