పెయిడ్ న్యూస్‌ను ప్రచురించొద్దు.. ప్రెస్ కౌన్సిల్ హెచ్చరిక

by Disha Web Desk 4 |
పెయిడ్ న్యూస్‌ను ప్రచురించొద్దు.. ప్రెస్ కౌన్సిల్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా సంస్థలను హెచ్చరించింది. వార్తా పత్రికలు చెల్లింపు వార్తల(పెయిడ్ న్యూస్)ను ప్రచురించరాదంటూ తెలిపింది. ఈ విషయంలో పాత్రికేయ ప్రవర్తనా నియమావళి - 2022కు కట్టుబడి చెల్లింపు వార్త ప్రచురణకు దూరంగా ఉండాలని సూచించింది. నాయకుల వ్యాఖ్యలు, ప్రకటనలను పత్రికలు వక్రీకరించకూడదు. పత్రికలో ఉటంకించిన వ్యాఖ్యలు నేతల భావాలను నిజస్ఫూర్తితో వెల్లడించేవిగా ఉండాలి అని పీసీఐ పేర్కొంది.

ఎన్నికల సమయంలో వేర్వేరు పత్రికల్లో ప్రచురితమైన రాజకీయ వార్తల్లో అంశం, పదజాలంతో సహా సారూప్యత కనిపిస్తే దాన్ని కాకతాళీయంగా భావించలేమని, వాటిని చెల్లింపు వార్తల కిందే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే సినీ తారలు పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగిందని పేర్కొనే కథనాలను చెల్లింపు వార్తలుగా భావించలేమని తెలిపింది. అభ్యర్థుల ఇంటర్వ్యూ లు, వార్తల ప్రచురణ విషయంలో సమతూకం పాటించాలని సూచించింది. ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలుస్తుందంటూ వచ్చే సర్వే నివేదికలను వాస్తవ నిర్ధారణ చేసుకోకుండా ప్రచురించరాదని తెలిపింది.

Next Story

Most Viewed