నాలుగు కాళ్లు ఉన్న అరదైన పాము.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో!

by Samataha |
నాలుగు కాళ్లు ఉన్న అరదైన పాము.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడ ఏది జరిగినా సరే క్షణాల్లో మన ముందు ఉంటుంది. ముఖ్యంగా మనకు కొన్ని రకాల జంతువులు లేదా సరీసృపాలు ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే? మనం బయట చూసే పాములు కానీ క్షీరదాలు ఒక రకంగా ఉంటాయి, నెట్టింట్లో కనిపించేవి ఇంకో రకంగా ఉంటాయి. పాములు అంటే అందరికీ తెలుసు వాటికి కాళ్లు ఉండవు, పాకుతూ వెళ్తుంటాయి. ఒక్కో పాము, ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని పాములు బాగా విషపూరితంగా ఉంటే కొన్ని పాముల అంత ప్రమాదకరం కాదు అని. కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్నా పామును జనాలు చూడటానికి కూడా భయపడిపోతున్నారు. ఇంతకీ అందులో అంత భయపడాల్సింది ఏం ఉంది అనుకుంటున్నారా? పాముకు కాళ్లు ఉండవు, కానీ తే తాజాగా నాలు కాళ్లు ఉన్న ఓ పాము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిని చూస్తే చాలు అందరూ షాక్ అవుతున్నారు. అంతే కాకుండా వామ్మో పామలుకు కాళ్లే ఉండవు, కానీ దీనికి ఏంటీ ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయంటూ ముచ్చటిస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ పాముకు తల దగ్గర ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. చాలా వరకు పాములకు కాళ్లు ఉండవు, కానీ దీనికి ఉన్న కాళ్లు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇది కాళ్ళతో పాకుతుంటే భయపడాల్సిందే ఎవరైనా. ఇక దీనికి ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది లైగ్ చేయగా చాలా మంది దీనిని షేర్ చేస్తున్నారు. కాగా, మీరు ఓసారి ఈ వీడియోపై లుక్ వేయండి.

Next Story