గులాబీ నేతల్లో అసంతృప్తి.. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపాటు

by Dishanational2 |
గులాబీ నేతల్లో అసంతృప్తి.. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సమావేశంలో సమస్యలపై మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసహనంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని లేకుంటే ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రత్యర్థులు బలపడుతున్నారని పార్టీ కార్యక్రమాలను యాక్టీవ్ చేయాలని అందుకు కార్యచరణ రూపొందించుకుందామన్నారు. పొరపాట్ల వల్లనే జీహెచ్ఎంసీ, రెండు ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యమని అలాంటివి జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలను, పార్టీని కాపాడు కుందామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీ బలపడుతుందనేవిషయాన్ని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని అడ్డుకోలేక పోతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నవారికి నామినేటెడ్ పోస్టులు సైతం ఇవ్వకపోవడంపై నేతలే ఆవేధన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పార్టీలో సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బలంగా ఉందని, మనం బలంగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ ప్రత్యర్థులు బలపడుతున్నారని అది గమనించి ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. పొరపాట్లతోనే జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్ లో ఓడిపోయామన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులంతా వెనుక బడ్డారన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, కార్యకర్తల కృషితోనే ఈ స్థాయిలో ఉన్నామని, పార్టీ జెండా మోసే కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ ఉన్నప్పటికీ తలసాని మాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని తానై వ్యవహరించడంతో పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేశారు.


Next Story