జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్

by Disha Web Desk 2 |
జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నెల 15 వరకు స్టైఫండ్ వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హస్టళ్లలో వసతులు కల్పించడంతో పాటు కొత్త హాస్టల్స్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు. వీటితో పాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్న మంత్రి హామీతో సమ్మెకు వెళ్లబోవడం లేదని జూడాల ప్రకటించారు.

కాగా, మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిన్న హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ నిన్న హామీ ఇవ్వగా ఈ మేరకు వారితో చర్చలు జరిగిన మంత్రి దామోదర రాజనర్సింహ సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో సమ్మెకు బ్రేక్ పడింది.


Next Story

Most Viewed