యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా.. డిమాండ్ ఇదే!

by Disha Web Desk 4 |
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా.. డిమాండ్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులనూ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాలలో 1335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 38 ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. వారిని చేసినట్లే యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను సైతం క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed