HYD: ధర్నాచౌక్‌లో నిరసనల హోరు

by Disha Web Desk 2 |
HYD: ధర్నాచౌక్‌లో నిరసనల హోరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా‌చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 5089 టీచర్ల పోస్టుల జీవోలో అనేక జిల్లాల్లో ఒకటి రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయని, దీంతో ఆరేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే 13 వేల టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ధర్నా కోనసాగుతోంది. ఈ ధర్నాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ నేత ఆర్.కృష్ణయ్య హాజరవుతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed