అసద్ ఆదేశిస్తే ఎస్సైని సస్పెండ్ చేస్తారా..? వీహెచ్‌పీ, బజరంగ్ దళ్

by Disha Web Desk 19 |
అసద్ ఆదేశిస్తే ఎస్సైని సస్పెండ్ చేస్తారా..? వీహెచ్‌పీ, బజరంగ్ దళ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆదేశానుసారం జగిత్యాల ఎస్సై అనిల్ కుమార్‌ను అకారణంగా సస్పెండ్ చేశారని, ఈ ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న ఎస్సై భార్య సంధ్యతో ఒక మహిళ గొడవకు దిగి గాయపరిచి బెదిరింపులకు గురిచేసినా ఆమెపై ఇప్పటి వరకు కేసు పెట్టలేదని వారు పేర్కొన్నారు.

ఎదుటివారి దాడి నుంచి రక్షించుకునేందుకు ఎస్సై చేసిన ప్రయత్నాన్ని తప్పుపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్యలు లేకుండానే ఓవైసీ ఆదేశానుసారం సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. అక్కడి డీఎస్పీ ప్రకాశ్, ఎస్పీ భాస్కర్ ఓవైసీ, ఎంఐఎం నేతలకు గులాంగిరి చేయడంలో తరిస్తున్నారన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలకు రాచమర్యాదలు చేసిన డీఎస్పీ, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎస్సైపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, అప్పటి వరకు ఉద్యమిస్తామని హెచ్ పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు.


Next Story