గత ప్రభుత్వం ఐటీడీఏ సమావేశాలు నిర్వహించలే.. భట్టి ఫైర్

by Disha Web Desk 14 |
గత ప్రభుత్వం ఐటీడీఏ సమావేశాలు నిర్వహించలే.. భట్టి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాజాగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలకమండలి సమావేశంలో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధికి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారుల ప్రణాళికలు ఉండాలని సూచించారు.

రెసిడెన్షియల్, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్ళడానికి కావలసిన సహకారం, అవగాహన కల్పించాలన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలని ఆదేశించారు.



Next Story

Most Viewed