ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేడు చర్చ.. ప్రవేశపెట్టే బిల్లు ఇదే..!

by Disha Web Desk 1 |
ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేడు చర్చ.. ప్రవేశపెట్టే బిల్లు ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-2025 సందర్భంగా ఇవాళ ఉభయ సభల్లో చర్చ కొనసాగనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరిచింది. ఇవాళ చర్చలో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆయన మరోసారి సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా సభలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల బిల్లు, ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటన నిషేధ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేత పత్రం విడుదల చేసి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కృష్ణా జలాల అంశంపై కూడా ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.



Next Story

Most Viewed